Tumbbad2: తుంబాడ్2లో కంగనా రనౌత్

హార్రర్ ఫాంటసీ జార్ లో ఇండియన్ మూవీలో కల్ట్ సినిమాగా నిలిచిన సినిమా తుంబాడ్(Tumbbad). ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ అంశాలను జోడించి ఈ సినిమాలో సరికొత్త ప్రపంచాన్ని సృష్టంచి ఆడియన్స్ ను మాత్రమే కాకుండా విమర్శకులను కూడా మెప్పించారు. 2018లో రిలీజైన తుంబాడ్ ఆ టైమ్ లో ఫ్లాపుగానే నిలిచింది.
కానీ తర్వాత తుంబాడ్ మూవీకి క్రమంగా ఆడియన్స్ నుంచి ఆదరణ లభించింది. గతేడాది ఈ సినిమాను రీరిలీజ్ చేయగా, ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. రిలీజ్ టైమ్ లో కంటే రీరిలీజ్ టైమ్ లోనే తుంబాడ్ కు భారీ కలెక్షన్లు వచ్చాయి. రాహి అనిల్ బార్వే(rahi anil barve), ఆనంద్ గాంధీ(anand gandhi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ ను పెన్ స్టూడియోస్(pen studios) తో కలిసి సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సోహుమ్ షా(Sohum Shah) నిర్మించనున్నారు.
వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న తుంబాడ్2(tumbbad2) పై అందరికీ భారీ అంచనాలు నెలకొనగా, పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సినిమా మరింత భారీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్(Kangana ranaut) ఓ కీలక పాత్రలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు.