హీరోలంతా డ్రగ్స్ బానిసలే.. పేర్లు చెప్పిన నటి…
బాలీవుడ్లో ఆమె ప్రతి మాటా సంచలనమే. ఆమె ప్రతి ట్వీటూ వివాదాస్పదమే. మరే హీరోయిన్‌కూ దక్కని కాంట్రావర్సీస్ క్వీన్ కిరీటాన్ని దక్కించుకున్న కంగనా రౌత్ మరోసారి తన గొంతును ఖంగు మనిపించి బాలీవుడ్‌ని కంగు తినిపించింది. యువ హీరో సుశాంత్ ఆత్మహత్య తరువాత నెపొటిజమ్పై చర్చకు దారి తీసేలా వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్…తాజాగా సుశాంత్ మరణం చుట్టూ అల్లుకున్న డ్రగ్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. అసలు బాలీవుడ్ హీరోల్లో డ్రగ్స్ తీసుకోని వారెవరైనా ఉన్నారా? అంటూ సూటిగా ప్రశ్నించింది. ఆమె బుధవారం చేసిన ట్వీట్లో 90శాతం బాలీవుడ్ హీరోలంతా తమ జీవితంలో ఏదో ఒక దశలో డ్రగ్స్ తీసుకున్నవారేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇవన్నీ ఖరీదైన పార్టీలలో చాలా తక్కువ మంది మధ్య జరుగుతాయి కాబట్టి బయటకు తెలిసే అవకాశం లేదంది. అంతేకాదు… ఈ విషయం తాను ఖచ్చితంగా చెప్పగలనంది. వీరు వినియోగించేవి బాగా ఖరీదైన డ్రగ్స్ అని కూడా చెప్పింది.
బాలీవుడ్లో టాప్ హీరోలుగా ఉన్న రణ్ వీర్ సింగ్, రణబీర్ కపూర్, ఆర్యన్ ముఖర్జీ, విక్కీ కౌశిక్ వంటి వారు తమ బ్లడ్ శాంపిల్స్‌ని డ్రగ్స్ టెస్ట్ కోసం ఇవ్వాలంటూ అభ్యర్ధిస్తున్నానంటూ పరోక్షంగా సవాల్ విసిరింది. వీళ్లపై కొకైన్ ఎడిక్ట్స్ అనే ముద్ర ఉందని తమ శాంపిల్స్‌ని ఇచ్చి తాము డ్రగ్స్ వాడడం లేదంటూ వీరు నిరూపించుకోవాలని సలహా ఇచ్చింది. తద్వారా వీరు ఎంతో మంది యువతకు స్ఫూర్తిని ఇచ్చినవారు అవుతారంది.













