Kangana Ranaut: అలాంటివి నాకు సెట్ అవవు
బాలీవుడ్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్(kangana ranaut) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదొక కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఫ్యాన్స్ తో ఈ చాట్ సెషన్ ను నిర్వహించిన కంగనా, అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. అందులో భాగంగా ఓ నెటిజన్ మీకు సినిమాలు ఇష్టమా? రాజకీయాలు ఇష్టమా అని అడిగారు.
దానికి కంగనా తనకు రెండూ ఇష్టమేనని, ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోలేనని, మనిషి లైఫ్ లో ఒక విషయం మాత్రమే నచ్చాల్సిన పని లేదని, ప్రతీ దాంట్లోనూ నేర్చుకునే విషయం ఉంటుందని, ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలూ రెండూ తనకు సమాన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని చెప్పింది. తన నెక్ట్స్ మూవీ గురించి మాట్లాడుతూ తాను ఓ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నట్టు కంగనా తెలిపింది.
ఈ సందర్భంగా కంగనా తన పెళ్లిపై వస్తున్న పుకార్ల గురించి కూడా స్పందించింది. తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను తాను విన్నానని కానీ వాటిలో ఏ ఒక్కటీ నిజం కాదని, తనకు పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం పై ఆసక్తి లేదని, అలాంటి విషయాలు అసలు తనకు సెట్ అవవని కంగనా క్లారిటీ ఇచ్చింది. దీంతో కంగనా పెళ్లి వార్తలపై అందరికీ క్లారిటీ వచ్చింది.







