Kanchana4: సైలెంట్ గా కానిచ్చేస్తున్న కాంచన4

కామెడీ హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగలగాలే కానీ ఆ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చి సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో ముని(Muni) ఒకటి. అదే కాంచన(Kanchana). రాఘవ లారెన్స్(Raghava Lawrence) స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్రాంచైజ్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది.
ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ లో మూడు సినిమాలు రాగా ఇప్పుడు నాలుగో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ముందు మూడు సినిమాలూ హిట్టై మంచి టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు కాంచన4(Kanchana4)పై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే కాంచన4 కు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుందట.
దీన్ని బట్టి చూస్తుంటే కాంచన4 షూటింగ్ ఎంతో సైలెంట్ గా శరవేగంగా జరుగుతున్నట్టు అర్థమవుతుంది. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తుండగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. కాంచన4 కూడా లారెన్స్ దర్శకత్వంలోనే తెరకెక్కుతుంది.