Kamal Hassan: ఫ్రెండ్ కోసం రంగంలోకి కమల్
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూలీ(Coolie). గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కాకుండా స్టాండ్ ఎలోన్ ఫిల్మ్ గా రూపొందించాడు లోకేష్. ఆగస్ట్ 14న కూలీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆల్రెడీ కూలీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే కూలీ నుంచి వచ్చిన కంటెంట్ సినిమాపై బజ్ ను విపరీతంగా పెంచగా ఇప్పుడు మరో అంశం ఆ బజ్ ను ఆకాశాన్నంటిస్తుంది. అదే లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Hassan) ఎంట్రీ. కూలీ సినిమాకు కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు కోలీవుడ్ మీడియా వర్గాల్లో బాగా వినిపిస్తోంది.
గతంలో రజినీ, కమల్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రజినీ కమల్ సినిమాకు వాయస్ ఇవ్వబోతుండటం స్పెషల్ గా మారనుంది. రజినీ సినిమా అవడంతో పాటూ తనకు విక్రమ్(Vikram) లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా అవడంతో లోకేష్ అడగ్గానే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కమల్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో నాగార్జున(nagarjuna), ఆమిర్ ఖాన్(aamir khan), ఉపేంద్ర(Upendra), శృతి హాసన్(Shruthi Hassan) కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.







