Kamal Hassan: అందుకే క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి చాలా టైమ్ పట్టింది

కమల్ హాసన్(Kamal Hassan) హీరోగా మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్(Thug Life). యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని మరిం పెంచింది. అందులో భాగంగానే తెలుగు మీడియా ముందుకొచ్చింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా కమల్ హాసన్ సినిమా గురించి, స్టార్ డమ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మణిరత్నం(Mani Ratnam) గారిని ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా. ఆయన్ని ఎప్పుడు కలిసినా సంతోషంగానే ఉంటుందని అన్నాడు. అప్పట్లో తమ కాంబినేషన్ లో వచ్చిన నాయకన్(Nayakan) మంచి హిట్ అవగా, ఇప్పుడొస్తున్న థగ్ లైఫ్ దాన్ని మించి భారీ హిట్ గా నిలుస్తుందని కమల్ హామీ ఇచ్చాడు. ఆడియన్స్ ఇచ్చిన స్టార్‌డమ్ తనకు ఎంతో ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉందని కూడా కమల్ అన్నాడు.
తానెంత స్టార్ అయినప్పటికీ ఆడియన్స్ ను కలవడానికే ప్రయత్నిస్తుంటానని, తాను కేరళలో హీరో అయినప్పటికీ తెలుగులో తాను స్టార్ ను అయ్యానని, స్టార్ గా ఇదే తన బర్త్ ప్లేస్ అని, తనను దయచేసి గురు అని పిలవొద్దని, జస్ట్ తనను గుర్తుపెట్టుకుంటే చాలని అన్నాడు. తన కెరీర్లో చేసిన ఎన్నో సినిమాల్లో తనకు ఇష్టమైన సినిమా థగ్ లైఫ్ అని, అందుకే ఈ క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టిందని ఆయన వెల్లడించాడు.