Kamal: ఈ ఏజ్ లోనూ ఆ స్పీడేంటి

ఈ రోజుల్లో సినిమాలకు ప్రమోషన్స్ అనేవి చాలా కీలకంగా మారాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ సినిమాకూ మేకర్స్ నెక్ట్స్ లెవెల్ లో ప్రమోషన్స్ లో చేసి వాటిని ఆడియన్స్ కు చేరవేస్తున్నారు. హీరోలు కూడా ఆ ప్రమోషన్స్ లో పాల్గొని తమ సినిమాతో పాటూ తమకు కూడా ఫాలోయింగ్ పెంచుకోవాలని చూస్తున్నారు.
అయితే కొంతమంది హీరోలు మాత్రం ఏదో పేరుకి ప్రమోషన్స్ కు వచ్చామని చెప్పుకునే రీతిలో షూటింగ్ తర్వాత రిలీజయ్యే మూడు నాలుగు ఈవెంట్స్ లో పాల్గొని ప్రమోషన్స్ ను లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ కమల్ హాసన్(Kamal Hassan) మాత్రం ఏడు పదుల వయసులో కూడా తన సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
కమల్ తాజా చిత్రం థగ్ లైఫ్(Thug Life) జూన్ 5న రిలీజ్ కానుంది. రిలీజ్ కు రెండు వారాలే ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని చూస్తోంది. అందులో భాగంగానే వరుసపెట్టి ఈవెంట్స్ ను ప్లాన్ చేశారు. మే 20న ముంబైలో హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, మే 21న మలయాళ ట్రైలర్ లాంచ్, మే 22న తెలుగు ట్రైలర్ లాంచ్, మే 24న చెన్నైలో ఆడియో రిలీజ్, మే 26 నుంచి 29 వరకు దేశంలోని ప్రధాన నగరాల విజిట్స్ తో పాటూ మే 31న మలేషియాలో ఓ ఈవెంట్, జూన్ 1న దుబాయ్ లో ఓ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేశారు. వీటన్నింటిలోనూ కమల్ హాసన్ పాల్గొననున్నాడు. ఈ వయసులో కూడా కమల్ ప్రమోషన్స్ లో ఇంత యాక్టివ్ గా పాల్గొనడాన్ని అందరూ అభినందిస్తున్నారు.