Kamal Hassan: కమల్ హాసన్, అన్బరివ్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ #KHAA అనౌన్స్మెంట్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరో ఎక్సయిటింగ్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తో పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ (అన్బు మణి, అరివు మణి) దర్శకులుగా అరంగేట్రం చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ #KHAA, కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా “హంట్ మోడ్ ఆన్” అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్ చేశారు.
ఈ సినిమా కమల్ హాసన్ ఐకానిక్ స్థాయికి సరిపోయే భారీ యాక్షన్ స్పెక్టకిల్‌గా రూపుదిద్దుకోబోతోంది. కమల్‌తో కలసి విక్రమ్ సినిమాలో తమ అద్భుతమైన స్టంట్ కొరియోగ్రఫీతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అన్బరీవ్.. ఇప్పుడు దర్శకులుగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సునీల్ కె.ఎస్ సినిమాటోగ్రఫీ, జేక్స్ బీజోయ్ మ్యూజిక్ అందించనున్నారు. ఎడిటింగ్ షమీర్ కె.ఎం, ప్రొడక్షన్ డిజైన్‌ను వినేష్ బంగ్లాన్.
#KHAA తో కమల్ హాసన్ ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ యాక్షన్ మాస్టర్స్ అన్బరీవ్కు తమ క్రియేటివ్ విజన్ చూపించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.







