కళ్యాణ్ రామ్ మరోసారి ఆలోచిస్తే బెటర్!
రీసెంట్ గా రిలీజైన కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ తో నడుస్తోంది. రివ్యూలు కూడా అంతే వచ్చాయి. అలాంటి డెవిల్ మూవీకి కళ్యాణ్ రామ్ సీక్వెల్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆశ్యర్చపరిచాడు. బింబిసార లాగా డెవిల్ కు మంచి టాక్ వచ్చి, ఈ సీక్వెల్ అనౌన్స్ చేస్తే ఆడియన్స్ విస్తుపోయేవారు కాదు.
కానీ డెవిల్ విషయంలో అలా జరగలేదు. అసలే డైరెక్టర్ ఇష్యూ ఈ సినిమాకు పెద్ద డిస్కషన్ అయింది. ఫస్ట్ లో సినిమాను డైరెక్ట్ చేసిన నవీన్ మేడారం డెవిల్ ఎలా ఉందని ఒపీనియన్ అడుగుతూ పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ సినిమాకు నా అనుభవం సరిపోతుంది కాబట్టే నేను డైరెక్టర్ గా మారానని అభిషేక్ నామా కవర్ చేస్తున్నాడు.
మొత్తానికి సినిమా ఎవరు తీశారన్నది పక్కన పెడితే అనుభవ లేమి మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అలాంటప్పుడు మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్ అంటే ఎలాంటి రిజల్ట్ వస్తుందోనని అనుమానాలొస్తున్నాయి. మరోవైపు కళ్యాణ్ రామ్ ను బింబిసార2 గురించి అడిగితే కచ్ఛితంగా ఉంటుందంటున్నాడు కానీ ఎవరితో ఎప్పుడనేది మాత్రం చెప్పడం లేదు. ఏదేమైనా డెవిల్ సీక్వెల్ విషయంలో మాత్రం కళ్యాణ్ రామ్ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.













