డెవిల్ సమస్య అదే!
మరో మూడు రోజుల్లో కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయినా సరే సినిమాకు తగ్గ బజ్ మాత్రం రావడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం కూడా ఖాయంగా చెప్పలేకపోతున్నారు. తన వంతు బాధ్యతగా కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలిస్తున్నాడు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా లాస్ట్ మినిట్ వర్స్క్ చూసుకుంటున్నాడు.
డేట్స్ సమస్య వల్ల సంయుక్త మీనన్ అందుబాటులోకి రాలేకపోతుంది. డిసెంబర్ సెకండ్ వీక్ వరకు రిలీజ్ డేట్ ను లాక్ చేసుకోకపోవడంతో డెవిల్ టీమ్ కు ప్రమోషన్స్ ఇబ్బంది వస్తోంది. ట్రైలర్ చాలా బాగున్నప్పటికీ జనాలకు రీచ్ అవాలంటే కేవలం ట్రైలర్ మాత్రమే సరిపోదు. దిల్ రాజు అండ ఉంది కాబట్టి థియేటర్లకు ప్రాబ్లమ్ లేదు.
ఎంత దిల్ రాజు అండ ఉన్నా సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం సినిమా రెండో రోజు నుంచి చతికిల పడటం ఖాయం. ఒకవేళ అన్నీ బాగుండి హిట్ అయితే సంక్రాంతి వరకు డెవిల్ థియేటర్లలో రచ్చ చేస్తుంది. బ్రిటీషర్ల కాలంలో జరిగిన ఒక పెద్దింటి హత్య కేసును చేధించే సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. డెవిల్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.













