దేవర టీజర్ పై అంచనాలు పెంచేస్తున్న కళ్యాణ్ రామ్
ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, తన తర్వాతి సినిమాను మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ దాని కోసం ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
దేవర టీజర్ కు సంబంధించిన టీజర్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డెవిల్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్, దేవర సినిమా ఎంతో అద్భుతంగా వస్తోందని, తారక్ ని ఈ సినిమాలో ఎంతో పవర్‌ఫుల్‌గా చూడనున్నారని, ఇప్పటివరకు టాలీవుడ్ స్క్రీన్ పై చూడని విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో ఉంటాయని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.
స్వయంగా నిర్మాతే ఇలా చెప్పడంతో ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. దానికి తోడు దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఈ టీజర్ గురించి పోస్ట్ చేశాడంటే టీజర్ కు సంబంధించిన రీరికార్డింగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉండుంటుందని అర్థమైపోతుంది. మరో రెండు మూడు రోజుల్లో ఫైనల్ వెర్షన్ ను తారక్ కు పంపి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారని టాక్. ఈ టీజర్‌ను గుంటూరు కారంతో పాటూ థియేటర్లలో స్క్రీనింగ్ జరిగిలే ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.













