వందేమాతరం కు కాళోజి పురస్కారం
ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు కాళోజీ పురస్కారం అందజేయన్నుట్లు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షుడు డి.సురేష్‌కుమార్ తెలిపారు. తెలంగాణ టీవీ డెవలప్మెంట్ ఫోరం, భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టీవీ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుందని ఆయన తెలిపారు. గత ఐదేళ్లుగా కాళోజి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆయన పేరుమీద తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ రచయితలకు పురస్కారాన్ని అందజేశామని అన్నారు. ఈ ఏడాది పురస్కారానికి వందేమాతరం శ్రీనివాస్‌ను ఎంపిక చేశామని సంతోషంగా తెలియజేస్తున్నానని అన్నారు. 2016లో ఈ అవార్డును చంద్రబోస్‌కు ప్రకటించామని, వారంలో జరగబోయే వేడుకలో ఒకే వేదికపై చంద్రబోస్, వందేమాతరం శ్రీనివాస్‌లను సన్మానించడం జరుగుతుందని అన్నారు.













