కల్కి రిలీజ్‌పై తమ్మారెడ్డి క్లారిటీ
కల్కి 2898 ఏడీ గా పేరు మార్చుకున్న ప్రాజెక్ట్ కె మూవీ నుంచి రీసెంట్గా రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను చూసి ట్రోల్ చేసిన అందరికీ టీజర్ తో గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు ప్రభాస్. కానీ ఈ సినిమా విషయంలో అందరినీ ఓ సందేహం వెంటాడుతుంది.
కల్కి రిలీజ్ డేట్ ఎప్పుడన్నదే ఆ సందేహం. రాజమౌళి సైతం ఇదే డౌట్ ను ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశాడు. కానీ దీనిపై చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా బృందంతో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ డైరెక్టర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా కల్కి రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.
కల్కి మూవీ వచ్చే ఏప్రిల్- మే నెలల్లో రిలీజయ్యే ఛాన్సున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. వాస్తవానికి కల్కి సినిమా సంక్రాంతికి రావాల్సింది కానీ ఇప్పుడా విషయం అసాధ్యమని తేలిపోయింది. తమ్మారెడ్డి మాటలు చూస్తే నమ్మదగ్గట్టే ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, ఫస్ట్ పార్ట్ కు సంబంధించి ఇంకో 40 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందని తెలిపాడు.
సెప్టెంబర్ లో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసి మిగతా టాకీ పార్ట్ పూర్తి చేస్తారని, ఈ షెడ్యూల్లోనే కమల్ హాసన్ కూడా జాయిన్ అవబోతున్నారని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు కమల్ హాసన్ ఇంకా షూట్‌కు రాలేదని కూడా చెప్పారు. కమల్ క్యారెక్టర్ పూర్తి స్థాయిలో సెకండ్ పార్ట్‌లోనే ఉంటుందని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.













