ప్రశాంత్ వర్మతో సినిమా గురించి కాజల్ ఏమందంటే?
పెళ్లి తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడానికి కాజల్ అగర్వాల్ శతవిధాల ప్రయత్నిస్తోంది. పెళ్లి తర్వాత సత్యభామగా కాజల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఈ వారంలో రిలీజ్ కానున్న సత్యభామ సినిమా కోసం కాజల్ గత రెండు వారాలుగా ప్రతీ చోటా తిరిగి సత్యభామను ప్రమోట్ చేస్తోంది.
కాజల్ ప్రమోషన్స్ తో సినిమాకు మంచి హైపే వచ్చింది. ఇదిలా ఉంటే కాజల్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని కొన్నాళ్ల కిందట ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సూపర్ హిట్ అయింది. తాజాగా సత్యభామ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ మాట్లాడుతూ ప్రశాంత్ తో అనుకున్న సినిమా గురించి మాట్లాడింది.
తమ కాంబోలో సినిమా అనుకున్న మాట నిజమే కానీ అనుకున్న సినిమాలన్నీ వెంటనే ఆడియన్స్ ముందుకొచ్చే సిట్యుయేషన్స్ ఉండవు. కొన్ని సినిమాలు చాలా లేట్ గా సెట్స్ పైకి వెళ్తాయి. తమ కాంబోలో సినిమా కూడా అంతే లేట్ గా సెట్స్ పైకి వెళ్తుందని ఆశిస్తున్నట్లు కాజల్ చెప్పుకొచ్చింది. అయితే హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ రేంజ్ మారిపోయింది.మరో ఐదేళ్ల వరకు ప్రశాంత్ వర్మ డేట్స్ ఖాళీగా ఉండేట్లు కనిపించడం లేదు. ఇలాంటి టైమ్ లో కాజల్ ను హీరోయిన్ గా పెట్టి ప్రశాంత్ సినిమా తీయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి మరి.













