బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ల మధ్య స్నేహబంధమా? శాశ్వత బంధమా?
కాజల్ అగర్వాల్ పెళ్లి అంటూ గతకొన్ని రోజులుగా ఏవేవో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాజల్ పెళ్లి చేసుకునేది ముంబై కి చెందిన ఓ వ్యాపారవేత్త అని ఇంకా ఏవేవో బయటకు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా కాజల్ చేసిన ఓ పోస్ట్‌ను నిశితంగా పరిశీలిస్తే.. ఓ విషయం అర్థమవుతోంది. కాజల్.. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మధ్య ఏదో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వీరిద్దరి ముచ్చట్లు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నాయి. మరి ఇంతకీ వీరిద్దరి ఏం జరుగుతుందో ఏమో?
వీళిద్దరి కలిసి రెండు సినిమాల్లో కవచం, సీత సినిమాల్లో జంటగా నటించారు. ఈ కారణంగానే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా కాజల్ చేసిన పోస్ట్‌ను చూస్తే వీరి స్నేహం కాస్త ముదిరి ఇంకాస్త ముందుకు వెళ్లినట్టు కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా వీరిద్దరికీ ఎడబాటు ఏర్పడింది కదా!
సెలెబ్రిటీలు సైతం ఎవరింట్లో వారు ఉండాల్సి వచ్చింది. గత మూడు నెలలుగా షూటింగ్స్ లేకుండా, ఇంట్లోనే ఉండటంతో తన వారిని మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చినట్టుంది హీరోయిన్ కి. అందుకు “మిస్ యూ నట్ కేస్” అంటూ త్వరగా నిన్ను చూడాలని ఇద్దరూ కలిసి షూటింగ్ లొకేషన్లో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇక కాజల్ అగర్వాల్ అంత ప్రేమగా మిస్ యూ అని చెప్పేసరికి బెల్లంకొండ కరిగిపోయినట్టున్నాడు. “మిస్ యూ టూ” అంటూ గాల్లో ముద్దులు విసిరే ఎమోజీని షేర్ చేస్తూ.. నేను నిన్ను చూడలేని, కలవలేని సందర్భంలో ఇలా అనకు అని ముద్దుగా కసిరాడు. ఇక వీరిద్దరు ముచ్చట్లు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
వీరిద్దరి ముచ్చట్లు చూసిన నెటిజన్లకు లెక్కలేనన్ని ప్రశ్నలు, అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఇద్దరి సంగతి ఏంటి? రిలేషన్ షిప్లో ఉన్నారా? పెళ్లి చేసుకోబోతోన్నారా? మీ మధ్య ఏం నడుస్తోంది? అంటూ ఇలా నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే వీటన్నంటికి సమాధానాలు తెలియాలంటే కాజల్, బెల్లంకొండ హీరోల్లో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.













