కె.విశ్వనాధ్ చే ‘ఇద్దరు’ టీజర్ విడుదల
యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధికా కుమారస్వామి, కె.విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇద్దరు. ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫరీన్ ఫాతిమా నిర్మాత. ఈ సినిమా టీజర్ లెజండరీ డైరక్టర్ కె.విశ్వనాథ్ చేతుల మీదుగా విడుదలైంది. దర్శకుడు ఎస్.ఎస్.సమీర్ మాట్లాడుతూ కోట్ల ఆస్తి కోసం జరిగే మైండ్ గేమ్ ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు మహారాష్ట్ర, గోవా, థాయిలాండ్లో షూటింగ్ చేశాం. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం అని అన్నారు.













