అన్నపూర్ణమ్మగారి మనవడికి కళాతపస్వి ఆశీస్సులు
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషించిన అన్నపూర్ణమ్మ గారి మనవడు చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎమ్మెన్నార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్టర్ రవితేజ మనవడిగా నటించాడు. కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే తనకున్న ప్రత్యేక అభిమానం కారణంగా దర్శకుడు శివనాగు ఆయన్ని కలిసి ఆశీస్సులు అందుకొన్నాడు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మగారి మనవడు చిత్రం పోస్టర్స్ తిలకించి కె.విశ్వనాథ్ చిత్ర విశేషాలను అడిగి తెలుసుకొన్నారు. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ చిత్రం విజయవంతం కావాలని విశ్వనాథ్ ఆకాంక్షించారు. ఈ సినిమా షూటింగ్ అమరావతి పరిసర ప్రాంతాల్లో జరిగిందని శివనాగు చెప్పగానే ఒకప్పుడు అక్కడ తను సప్తపది చిత్రం షూటింగ్ చేసినట్లు విశ్వనాథ్ గుర్తు చేసుకొన్నారు.













