బంగారం లాంటి ఆఫర్ మిస్ చేసుకున్న దేవరకొండ
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేస్తారని కానీ, అసలు ఈ కాంబోలో ఓ మూవీ వస్తుందని కానీ ఎవరూ ఊహించలేదు. తాజాగా వీరి కాంబోలో వార్2 మూవీ అనౌన్స్ చేసిన మేకర్స్, అందరినీ షాక్ కు గురయ్యేలా చేసి, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు.
ఈ మధ్యన హృతిక్ గురించి ఎవరు మాట్లాడిన, అందులో వార్ టాపిక్ ముందుంటుంది. ఈ సినిమా బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించి, బాక్సాఫీస్ ను షేక్ చేసి స్టైలిష్ యాక్షన్‌గా మెప్పించింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అప్పట్లోనే అనౌన్స్ చేశారు. ఇంతవరకు అందరికీ తెలిసిందే కానీ ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్ కూడా ఉంటారంటే అసలు మూవీ లవర్స్ కి ఇంతకంటే ఏం కోరుకుంటారు?
ఇదిలా ఉంటే అసలు వార్2లో నటించే గోల్డెన్ ఛాన్స్ ఎన్టీఆర్ కంటే ముందు యంగ్ హీరో విజయ్ దేవరకొండకి వచ్చిందట. లైగర్ షూటింగ్ టైమ్‌లో హృతిక్, విజయ్ కాంబోలో ఈ సీక్వెల్ సెట్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్ విజయ్ను కలిశారట. దీనికి సంబంధించిన చర్చలు అప్పట్లో జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.
కానీ పాన్ ఇండియన్ లెవెల్లో లైగర్ డిజాస్టర్ అవడంతో ఆ ఆలోచన అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగు నుంచి మరో స్టార్ హీరో కోసం చూస్తుంటే అప్పుడు ఆర్ఆర్ఆర్ తో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ కనిపించాడు. అలా ఎన్టీఆర్ ను లైన్ లో పెట్టి తారక్ నుంచి వార్ మేకర్స్ గ్రీన్ సిగ్నల్ అందుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వార్2 తో ఎన్టీఆర్ బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట.













