John Abraham: బాలీవుడ్ గందరగోళంగా ఉంది: జాన్ అబ్రహం
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే ముందుగా కనిపించేది బాలీవుడ్. అయిత ఒకప్పటిలా ఇప్పుడు బాలీవుడ్ నుంచి గొప్ప సినిమాలు, అదిరిపోయే కంటెంట్, హిట్ సినిమాలు రావడం లేదు. దీంతో నార్త్ ఆడియన్స్ సైతం సౌత్ సినిమాల వైపే చూస్తున్నారు. సౌత్ సినిమాలకు ఈ మధ్య డిమాండ్ పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం(John Abraham) తనకు హిందీ చిత్ర పరిశ్రమను చూస్తుంటే ఆందోళనగా ఉందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ లో వస్తోన్న సినిమాలపై నెట్టింట భారీగా విమర్శలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ గందరగోళంగా ఉందని, ఇండస్ట్రీని ఇలా చూసి తనకు కంగారుగా ఉందని జాన్ అబ్రహం తెలిపారు.
బాలీవుడ్ కూడా కొత్తగా ట్రై చేయాల్సిన టైమొచ్చిందని, అలాంటి వారు చాలా తక్కువ మందే ఉన్నారని, భిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుని, అలాంటి సినిమాలే చేయాలని, అలా జరగాలంటే అందరికీ స్వేచ్ఛ ఉండాలని, అప్పుడే ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని, బాలీవుడ్ నుంచి మంచి సినిమాలు వస్తున్నప్పటికీ ప్రతీరోజూ కావాలని ఎవరొకరు బాలీవుడ్ ను విమర్శిస్తుండటం తనకు ఎంతో బాధను కలిగిస్తుందని జాన్ అబ్రహం వెల్లడించారు.













