తిరుమల సెంటిమెంట్ గురించి చెప్పిన జాన్వీ
అతిలోక సుందరి శ్రీదేవి- బోనీ కపూర్ దంపతులు క్రమం తప్పకుండా తమ పిల్లలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ తో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాళ్లు. కనీసం ఏడాదిలో నాలుగైదు సార్లైనా శ్రీవారి సేవలో శ్రీదేవి కుటుంబ సమేతంగా పాల్గొనేది. అయితే శ్రీదేవి చనిపోయాక బోనీకపూర్ తిరుమల రావడం తగ్గించారు.
కానీ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ మాత్రం తన తల్లి పద్ధతిని ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తుంది. అప్పుడప్పుడు బోనీ కపూర్, ఖుషి కపూర్ తో వాళ్ళెవరూ లేకపోతే తానే ఒక్కటి వచ్చి దర్శనం చేసుకుని వెళ్లేది. తర్వాత జాన్వీ లైఫ్ లోకి ప్రియుడు శిఖర్ పహారియా వచ్చాక తనతో పాటూ కలిసి శ్రీవారిని దర్శనం చేసుకుంటుంది.
అయితే జాన్వీ తరచూ తిరుమల రావడం ఎలా అలవాటైందని అడిగితే తన తల్లి పేరు చెప్పింది. తన తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకమని, తరచూ తిరుమల వెళ్లేదని, తల్లి వల్లే స్వామిపై తనకు భక్తి ఏర్పడిందని, ఇంట్లో వాళ్లంతా బర్త్ డే కు తిరుమల వెళ్లడం ఓ సెంటిమెంట్ గా మారిందని టైమ్ దొరికితే మెట్ల మార్గం ద్వారా కాలి నడకన వెళ్తుంటానని చెప్పింది. అంతేకాదు జాన్వీ ఇంట్లో క్రమం తప్పకుండా ప్రతి రోజూ పూజ చేస్తుందట. కుదిరినప్పుడు స్తోత్రాలు కూడా చదువుకుంటుందట. తన కొత్త సినిమా షూటింగ్ మొదలైనప్పుడు స్వామి ఫోటో చూసుకునే కెమెరా ముందుకెళ్తానని జాన్వీ తెలిపింది.













