మరో ఆఫర్ కొట్టేసిన జాన్వీ
దేవర సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు ఆ సినిమా రిలీజ్ కాకముందే ఇప్పుడు కోలీవుడ్ లో సూర్య సరసన మరో భారీ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మహాభారతం ఆధారంగా డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ తీయబోయే పాన్ ఇండియా సినిమాలో కర్ణుడికి జోడీగా జాన్వీ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
కర్ణుడి భార్యల్లో ఒకరిగా జాన్వీ కపూర్ ఎంపికైందని, ఇప్పటికే అగ్రిమెంట్ కూడా జరిగిందని టాక్. రెగ్యులర్ షూటింగ్ ఈ వేసవి నుంచి మొదలుపెట్టేలా ప్లాన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న ఈ కథను గతంలో విక్రమ్ వేరే డైరెక్టర్ తో మొదలుపెట్టాడు. కానీ కొంత షూటింగ్ అయ్యాక కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.
ఇప్పుడు అదే కథతో సూర్, బాలీవుడ్ డైరెక్టర్ తో చేస్తున్నాడు. హిందీలో ఎన్నో సినిమాలు చేసినా ఇప్పటికీ మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్న జాన్వీ కపూర్ ఎలాగైనా సౌత్ లో సెటిలవ్వాలని చూస్తోంది. దానికి తగ్గట్టే అమ్మడుకు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఎలాగూ ఇక్కడ హీరోయిన్ల కొరత ఉంది కాబట్టి జాన్వీకి ఒక్క హిట్ పడితే ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం.













