తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయిన జాన్వీ కపూర్…
జాన్వీ కపూర్ ఈ పేరు అటు బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది. దివంగత నటి అందాల తార శ్రీదేవి నట వారసురాలుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొద్ది కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. మరాఠి మూవీ సైరాట్ సినిమాకి ఆధారంగా కరణ్ జోహార్ తెరకెక్కించిన మూవీ ” దఢక్ ” తో బాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయింది ఈ బ్యూటీ. తర్వాత పలు వెబ్ సిరీస్ లో కనిపించి కనువిందు చేసింది. ” గుంజన్ సక్సెనా ది కార్గిల్ గర్ల్ ” తో తన నట విశ్వరూపాన్ని చూపించి మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో తన సత్తాని చూపించడానికి రెడీ అవుతుంది జాన్వీ కపూర్. నందమూరి నటసింహం ఎన్టీఆర్ తో కలిసి జత కట్టడానికి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ, తన లేటెస్ట్ ఫొటోస్ ని, స్టిల్స్ ని అప్ డేట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రెజెంట్ ఈ పోస్ట్ గురించే బిటౌన్ మాట్లాడుకుంటున్నారు. తాజాగా జాన్వీ కపూర్ త తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.
” నేను ఇప్పటికీ ప్రతీ చోటా నిన్నే వెతుకుతున్నాను అమ్మా. ఇప్పటికీ నేను చేసే ప్రతి పనిని నిన్ని గర్వించేలా చేస్తున్నానని ఆశిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా, నేను చేసే ప్రతి పని కూడా నీతోనే మొదలవుతుంది. నీతోనే ముగుస్తుంది ” అంటూ ఎమోషనల్ అయింది. సోషల్ మీడియాలో ఇన్ స్టా వేదికగా శ్రీదేవిలో కలిసి వున్న ఓ ఫొటోని షేర్ చేసి తల్లి గురించి జాన్వీ కపూర్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది













