Jeethu Joseph: దృశ్యం 3 పై అంచనాలు పెట్టుకోవద్దు

ఎవరైనా సరే తమ సినిమాలకు ఎక్కువ హైప్ తెచ్చుకోవాలని చూస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఎక్కువ హైప్ కూడా ప్రమాదమే అంటున్నారు. అలాంటి వారిలో మలయాళ ఇండస్ట్రీ వారు ముందుంటున్నారు. రీసెంట్ గా లోక(lokah) సినిమాకు ఎక్కువ హైప్ రావడాన్ని ఊహించని చిత్ర యూనిట్ ఆ హైప్ చూసి భయపడి, సినిమా గురించి మరీ ఎక్కువగా ఊహించుకోవద్దని చెప్పింది.
ఇప్పుడు మరో మలయాళ సినిమా పై కూడా అంచనాలు పెట్టుకోవద్దని చెప్తున్నారు డైరెక్టర్ జీతూ జోసెఫ్(jeethu joseph). ఆ సినిమానే దృశ్యం3(Drishyam 3). ఇప్పటికే దృశ్యం ఫ్రాంచైజ్ లో రెండు సినిమాలు రాగా ఇప్పుడు మూడో భాగానికి రంగం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే మేకర్స్ దృశ్యం3 సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుంది.
ఆల్రెడీ దృశ్యం ముందు రెండు భాగాలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మూడో పార్ట్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకు ఎక్కువ అంచనాలతో వెళ్లొద్దంటున్నారు జీతూ జోసెఫ్. మొదటి రెండు భాగాల్లో ఉన్నట్టు ఇందులో ట్విస్టులు, థ్రిల్స్ కంటే ఎమోషన్ కే పెద్ద పీట వేస్తున్నామని, అందుకే ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దంటున్నారు. అలా అని జీతూని తక్కువ అంచనా వేయడానికి లేదు.