జేడీపై విష ప్రయోగం
ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు జేడీ చక్రవర్తి. అయితే తరువాత దర్శకుడిగా మారి సినిమాలు చేశాడు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. మరల ఈ మధ్య నటుడిగా మారి బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దయ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ సందర్భంగా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.
హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న జేడీ చక్రవర్తి, ఆ తర్వాత డైరెక్టర్ గా మారి సినిమాలు చేశాడు. డైరెక్టర్ గా ఆయన తీసిన సినిమాలు అనుకున్న రేంజ్లో ఆడకపోవడంతో ఇప్పుడు మళ్లీ నటుడిగా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు జేడీ. త్వరలోనే జేడీ దయ అనే వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు.
ఈ ప్రమోషన్స్ లో జేడీ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఆ మధ్యన యాంకర్ విష్ణు ప్రియ ఓ టాక్ షో లో జేడీని ప్రేమిస్తున్నానని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని కామెంట్ చేయడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దానికి కారణం వీరిద్దరూ దయ వెబ్ సిరీస్ లో నటించడమే. గతంలో ఓ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న జేడీ, తర్వాత ఆమెతో విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు.
దీంతో విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై జేడీ క్లారిటీ ఇచ్చాడు. విష్ణు ప్రియ, తాను కలిసి ఈ సిరీస్ లో నటించడంతో తమ మధ్య ఓ రిలేషన్ ఏర్పడిందని, కాకపోతే ఆ రిలేషన్ అందరూ అనుకున్నట్లు కాదని, తమ మధ్య ఉన్నది గురు శిష్యుల సంబంధం మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, తన మాజీ భార్య తనకు విష ప్రయోగం చేయడం వల్ల తాను చావు బతుకుల వరకు వెళ్లినట్లు, అందుకే ఆమె నుంచి విడాకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు జేడీ.













