Jayam Ravi: దేవుడిని మోసం చేయలేవంటూ జయం రవి భార్య పోస్ట్

తమిళ నటుడు రవి మోహన్(ravi mohan) అలియాస్ జయం రవి(jayam Ravi) గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు. భార్యకు తెలియకుండా విడాకులను ప్రకటించిన ఆయన ఆ తర్వాత తన పేరుని జయం రవి నుంచి రవి మోహన్ గా మార్చుకుంటున్నానని వార్తల్లోకెక్కారు. భార్యతో విడాకులు అనౌన్స్ చేశాక సింగర్ కెనీషా(Kenisha)తో కలసి కనిపిస్తున్న ఆయన రీసెంట్ గా తిరుమల వెళ్ళారు.
తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న రవి మోహన్, కెనీషా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్తి(Aarthi) రీసెంట్ గా తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు, నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ దేవుడిని మోసం చేయలేవంటూ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ రవి మోహన్, కెనీషా తిరుమల టూర్ ను ఉద్దేశిస్తూనే అని అందరూ అనుకుంటున్నారు.
కాగా ఆర్తితో విడాకుల వివాదం ఓ వైపు కోర్టులో ఉండగానే రవి మోహన్ పదే పదే కెనీషాతో కలిసి పబ్లిక్ లో కనిపించడం, పెళ్ళిళ్లలకు, పార్టీలకు, గుడికి వెళ్తూ కనిపించడం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. అయితే కెనీషా వల్లే తన జీవితం నాశనమైందని, తాను రాకముందు తన జీవితంలో ఎలాంటి సమస్యలు లేవని, ఆర్తి ఇప్పటికే పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే.