Javed Jafri: ట్రైలర్ బాగుంటేనే కలెక్షన్లొస్తాయి: బాలీవుడ్ నటుడు
ఏ సినిమాకైనా కలెక్షన్స్ ఎక్కువ రావాలంటే ప్రమోషన్స్ చేయాలనే విషయం అందరికీ తెలిసిందే. అలా అని ప్రమోషన్స్ చేసిన అన్ని మూవీస్ సక్సెస్ అవాలనే రూలేం లేదు. కొన్ని మూవీస్‌కు ప్రమోషన్స్ చేసినా ఫ్లాప్ అవుతుంటే, మరికొన్ని మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా బ్లాక్ బస్టర్లు అవుతాయి. దీనిపై తాజాగా ఓ సీనియర్ బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రి(Javed Jafri) మాట్లాడాడు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు ప్రమోషన్స్ ఏ మాత్రం ఉపయోగపడవని తీసిపారేశాడు. మూవీ రిలీజ్ టైమ్ లో రకరకాలుగా చేసే ప్రమోషన్స్ అన్నీ వృధానే అని తేల్చేశాడు. అంతేకాదు, ఇన్‌స్టా ఫాలోయర్ల నెంబర్ కూడా మూవీ కలెక్షన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఊర్వశీ రౌతెలా(Urvasi Rauthela)కు ఇన్‌స్టాలో 72 మిలియన్ల ఫాలోవర్లున్నారని, ఆమె ఫాలోయర్లలో కనీసం 10 మిలియన్ మంది టికెట్ కొని మూవీ చూసినా ఆమె నటించిన ప్రతి సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసేది కదా అని ప్రశ్నించాడు.
ప్రమోషన్స్ మాత్రమే సినిమా హిట్ ను ఫిక్స్ చేయలేవని, ఏ సినిమాకైనా బిజినెస్ బాగా జరిగి వసూళ్లు మంచిగా రావాలంటే ట్రైలర్ ముఖ్యమని, అదే సినిమాకు వసూళ్ల వర్షం కురిపిస్తుందని జావేద్ జాఫ్రి క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్ బావుంటేనే సినిమా నెక్ట్స్ లెవెల్ కు వెళ్తుందని, ట్రైలర్ బావుందంటేనే తాను సినిమాకు వెళ్తానని చెప్తున్నాడు జావేద్.













