Sundeep Kishan: డైరెక్టర్ గా విజయ్ కొడుకు.. మేకింగ్ వీడియో చూశారా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) వారసుడు జాసన్ సంజయ్(Jason Sanjay) తండ్రి బాటలో హీరోగా కాకుండా డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఇవ్వబోతున్నాడు. మెగా ఫోన్ చేతపట్టి డైరెక్టర్ అవాలని డిసైడైన జాసన్ సంజయ్ లండన్లో స్క్రీన్ రైటింగ్లో బి.ఎతో పాటూ టోరంటో ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా పూర్తి చేశాడు.
జాసన్ సంజయ్ డైరెక్టర్ గా మారి లైకా ప్రొడక్షన్(Lyca Productions) బ్యానర్ లో సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఎంతో వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ ఏంటనేది ఇంకా దర్శకనిర్మాతలు ఫిక్స్ చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పుడో అప్డేట్ వచ్చింది.
మే 7వ తేదీన సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తూ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మేకింగ్ వీడియోను బట్టి ఈ సినిమా ఒక యాక్షన్ ఫిల్మ్ అని అర్థమవుతుంది. సందీప్ కెరీర్లో 31వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫారియా అబ్దుల్లా(Faria Abdhulla) హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం.






