Janhvi Kapoor: రాజస్థానీ గెటప్ లో అదరగొడుతున్న జాన్వీ
బాలీవుడ్ భామలు ఏ రేంజ్ లో ఫ్యాషన్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా తమ ఫ్యాషన్ ఎంపికలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు బాలీవుడ్ బ్యూటీలు. వారిలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఓ మెట్టు పైన ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తనకు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూ, ఎప్పుడూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే జాన్వీ తాజాగా ఓ క్లాసిక్ లుక్ లో మెరిసింది. ఈ ఫోటోల్లో జాన్వీ కళ్లకు కాటుక, వాలు జడతో డిజైనర్ బ్లూ లెహంగాలో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. లెహంగాకు తగ్గ జ్యుయలరీ ధరించగా, జాన్వీని చూసి నెటిజన్లు ఇదేం అందం.. మతులు పొతున్నాయని కామెంట్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.







