Janhvi Kapoor: ఫ్యాషన్ వీక్ లో మెరిసిపోతున్న జాన్వీ

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ క్రేజ్ సంపాదిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ దుస్తుల్లో కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకునే జాన్వీ తాజాగా పారిస్ లో జరుగుతున్న ఫ్యాషన్ వీక్ ఫెస్టివల్ లో మెరిసింది. ఫుల్ స్లీవ్స్ తో ఉన్న బ్లాక్ అండ్ వైట్ మినీ డ్రెస్ ధరించి, జుట్టును ముడిపెట్టి, చేతిలో హ్యాండ్ బ్యాగ్ ను పట్టుకుని మరింత స్టైలిష్ గా కనిపించింది. ఈ ఫ్యాషన్ లుక్స్ లో జాన్వీ వింటేజ్ లుక్ లో కనిపించిందని నెటిజన్లు ఆమె ఫోటోలకు లైకులు కొడుతూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.