Jana Nayagan: మలషియాలో జన నాయగన్ ఆడియో లాంచ్
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్(Vijay) నటిస్తున్న సినిమా జన నాయగన్(jana nayagan). హెచ్. వినోత్(H Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే(pooja Hegde) హీరోయిన్ గా నటిస్తుండగా మమిత బైజు(mamitha baiju) కీలక పాత్రలో నటిస్తోంది. పొంగల్ కానుకగా జనవరి 9న జన నాయగన్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.
విజయ్(Vijay) పూర్తి స్థాయి రాజకీయాల్లో వెళ్లేముందు చేస్తున్న ఆఖరి సినిమాగా జన నాయగన్ కు ప్రత్యేక క్రేజ్ ఉంది. కొంతమందైతే ఇదే విజయ్ ఆఖరి సినిమా అని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమా ఆడియో లాంచ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ డిసెంబర్ 27న జరగనున్నట్టు సమాచారం.
జన నాయగన్ ఆడియో లాంచ్ ను భారీగా నిర్వహించి విజయ్ కు మంచి మెమొరీగా మార్చాలనే ప్రయత్నంలో భాగంగా మేకర్స్ దాన్ని మలేషియా లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్టేడియం బుకిట్ జలాల్(stadium bukit jalal) లేదా పుత్రజయ(putrajaya) లో ఏదొక వేదికగా ఈ ఈవెంట్ ను నిర్వహించాలని చూస్తున్నారట. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.







