Jahnvi Kapoor: కొత్త ప్రాజెక్టును ఓకే చేసిన జాన్వీ

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(janhvi kapoor) బాలీవుడ్ లో చేసిన రీసెంట్ సినిమాలు ఆమెకు అనుకున్న ఫలితాలు ఇవ్వలేకపోయాయి. జాన్వీ నుంచి ఇటీవల వచ్చిన పరమ్ సుందరి(param sundari), సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి(sunny sanskari ki tulasi kumari) సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయినప్పటికీ జాన్వీ ఎక్కడా నిరాశకు లోనై, కుంగిపోకుండా కెరీర్ లో ముందుకెళ్తుంది.
అందులో భాగంగానే జాన్వీ ఓ కొత్త సినిమాను ఒప్పుకుంది. జాన్వీ తాజాగా సైన్ చేసిన సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. టైగర్ ష్రాఫ్(tiger shroff), లక్ష్య(lakshya) ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్(karan johar) నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ యాక్షన్ డ్రామాకు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను కేవలం రొమాంటిక్ మూవీస్ మాత్రమే కాదు, ఇలాంటి యాక్షన్ తరహా సినిమాలు కూడా చేయగలనని నిరూపించుకోవడానికే జాన్వీ ఈ ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.
రాజ్ మెహతా(raj mehta) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ యాక్షన్ ఇంటెన్స్ డ్రామాతో రాబోతుందని వార్తలొస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమాలో జాన్వీకి చాలా మంచి పాత్ర దక్కిందని అంటున్నారు. రెండు వరుస ఫ్లాపుల తర్వాత జాన్వీ ఇలాంటి సినిమాను ఓకే చేయడం అందరికీ షాకింగ్ గా ఉన్నప్పటికీ, జాన్వీ ఒకే తరహా సినిమాలు చేయకుండా నటిగా అన్ని జానర్లలో నటించడానికి సిద్ధపడటం నిజంగా అభినందనీయం.