Jagapathi Babu: ఫ్యాన్స్ కు టాస్క్ ఇచ్చిన జగపతిబాబు
సోషల్ మీడియా బాగా ఎక్కువైన నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా ఈ టెక్నాలజీని వాడుకుంటూ తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. నెట్టింట యాక్టివ్ గా ఉంటూ తమ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటున్నారు. హీరో, హీరోయిన్ల దగ్గర నుంచి అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. మరికొంత మందైతే ఎప్పుడూ ఏదొక విషయంలో మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు.
అసలు విషయానికొస్తే జగపతి బాబు(Jagapathi Babu) కూడా ఈ సోషల్ మీడియాను తెగ వాడుతున్నాడు. ఎప్పుడూ ఏదొకటి పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉండే జగ్గూ భాయ్(Jaggu Bhai) తాజాగా తన ఎక్స్ లో ఓ ఫోటోను షేర్ చేశాడు. ఒక గ్రూప్ ఫోటోను షేర్ చేసి అందులో తానెక్కడ ఉన్నాడో కనిపెట్టమని ఫాలోవర్లకు పెద్ద టాస్కే ఇచ్చాడు.
జగ్గూ షేర్ చేసింది బాగా పాత ఫోటో అవడం వల్ల అతన్ని వెంటనే గుర్తు పట్టడం అంత ఈజీ కాలేదు కానీ ఆఖరికి కాస్త కష్టపడ్డ ఫ్యాన్స్ ఆ ఫోటోలో జగపతి బాబు ఎక్కడున్నాడో కనిపెట్టేశారు. జగ్గూ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్ మీడియాను బాగా వాడుతూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జగపతి బాబు, తాను వెకేషన్ కు వెళ్లినా అక్కడి నుంచి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇక కెరీర్ విషయానికొస్తే పలు హిందీ, తమిళ సినిమాల్లో విలన్ గా నటిస్తున్న జగ్గూ భాయ్ కు ఆర్సీ16(RC16)లో మంచి పాత్ర దక్కిందని చెప్తున్నారు.













