Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా అలరించిన జగపతి బాబు(jagapathi babu) ఇప్పుడు విలన్ గా నటిస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో కంటే సెకండ్ ఇన్నింగ్స్ లోనే జగపతిబాబు స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా జగపతి బాబు మిరాయ్(mirai) సినిమాలో కీలక పాత్రలో నటించారు. తేజ సజ్జా(teja sajja) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ నిన్న రిలీజైంది.
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా టీమ్ మొత్తం ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో(the great indian kapil sharma Show) లో పాల్గొనగా, అందులో జగపతి బాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. షో లో పుష్ప2(pushpa2) ప్రస్తావన రాగా, ఆ మూవీలో జగ్గూ భాయ్(Jaggu Bhai) కేంద్ర మంత్రిగా నిపించిన విషయం తెలిసిందే. పుష్ప2లో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ జగపతి బాబు ఓ కామెంట్ చేయగా అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాను సినిమాల్లో ఇప్పటివరకు విలన్ గా నటిస్తూ వచ్చానని, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే మాత్రం తాను హీరోను అవుతానని, ఎందుకంటే పాలిటిక్స్ లో ప్రతినాయకులు ఎక్కువ ఉంటారు కాబట్టి అప్పుడు తానే హీరోని అవుతానని చెప్పి నవ్వులు పూయించారు. కాగా గతంలో పరంపర(parampara) వెబ్ సిరీస్ వచ్చిన టైమ్ లో తనకు రాజకీయాలు అసలు సెట్ అవ్వవని, రాజకీయాల్లోకి రావడం ఇంపాజిబుల్ అని ఆయన చెప్పారు.