‘సాహో’లో జాకీ ష్రాఫ్
ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన శ్రద్దా కపూర్ ని సెలక్ట్ చేయగా మరో బాలీవుడ్ అగ్ర నటుడిని విలన్ పాత్రలో ఎంచుకున్నాడు దర్శకుడు సుజిత్. ఆయనే జాకీ ష్రాఫ్. రీసెంట్ గా దర్శకుడు సుజిత్ సాహో సినిమా కథ చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒకే చేశాడట జాకీ ష్రోఫ్. బాహుబలి లాంటి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ.. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్థాయిలో హీరో అయ్యాడని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ‘సాహో’ చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే వారంలో జాకీ చిత్ర యూనిట్‌తో కలిసి షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు ఫిలింసిటీలోనే చిత్రీకరణ జరగనుంది.













