Viswambhara: ఐటెం సాంగ్ భామ కోసం విశ్వ ప్రయత్నాలు

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ట(vassishta) దర్శకత్వంలో చేస్తున్న సినిమా విశ్వంభర(viswambhara). భారీ అంచనాలతో సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనేది ఇప్పటి వరకు మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం విశ్వంభర సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉందని తెలుస్తోంది. ఆ ఐటెం సాంగ్ షూటింగ్ ఇంకా పూర్తవలేదట. ఈ సాంగ్ ను ఏ హీరోయిన్ తో చేయిస్తే బావుంటుందని మేకర్స్ కొన్నాళ్లుగా ఆలోచిస్తున్నని సమాచారం. యంగ్ హీరోయిన్, మరీ చిన్న హీరోయిన్ ను తీసుకుంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుందని భావిస్తున్నారట.
ఇక మిగిలింది తమన్నా(tamannaah), సమంత(samantha), పూజా హెగ్డే(pooja hegde). సమంత ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ చేయదు. తమన్నా ఆల్రెడీ పలు సాంగ్స్ చేసింది కాబట్టి రొటీన్ అవుతుందేమో అనుకుంటున్నారట. దీంతో ఈ సాంగ్ కోసం పూజా హెగ్డేను తీసుకోవాలా లేక మరో హీరోయిన్ ను తీసుకోవాలా అని చిత్ర యూనిట్ డిస్కషన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సీజీ వర్క్, ఈ ఐటెం సాంగ్ షూటింగ్ పూర్తైతే విశ్వంభరను ఆగస్ట్ నెలాఖరులో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్(uv creations) భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.