ఆ నిర్మాత ఇంట్లో ఐటీ రైడ్స్.. అసలేం జరుగుతోంది?
మూవీ ప్రొడ్యూసర్ ఇంట్లో, ఆఫీస్ లో ఐటీ రైడ్స్ జరగడం కొత్తేమీ కాదు. ఒక బ్యానర్ నుంచి పెద్ద సినిమాలు వస్తున్నాయన్నా, వరుస విజయాలొచ్చినా వారి ఆఫీసుల్లో ఐటీ వాళ్లు రైడ్ చేస్తుంటారు. మొన్నీ మధ్య పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై కూడా ఇలానే ఐటీ దాడులు జరిపారు. కానీ ఈ వ్యవహారం చాలా సింపుల్ గా తేలిపోయింది.
ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత ఆఫీస్ పైన కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ వార్ ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. టైగర్ నాగేశ్వరరావు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు బీజేపీ మనిషిగా మంచి గుర్తింపుంది. కేంద్రంలో రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఆయన సినిమాలు తీస్తున్నాడని అందరూ అంటూంటారు.
కన్శీర్ ఫైల్స్ సినిమా ఆయనదే. దాని రిలీజ్ తర్వాత ఆయన పెద్ద పెద్ద బీజేపీ నేతలతో కలిసి సన్నిహితంగా మెలిగిన విషయం అందరికీ తెలుసు. ఇండియా హౌస్ అనే సినిమాను కూడా ప్లాన్ చేశాడు. ఇలాంటి నేపథ్యమున్న వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ పై ఐటీ దాడులు జరగడంతో టాలీవుడ్ లో ఈ విషయం చర్చనీయాంశమైంది. మరి ఈ రైడ్స్ వెనుక ఏదైనా వేరే రీజనుందా అని తెలియాల్సి ఉంది.













