Sandy: ఆ కళ్ల వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా!

లియో(leo), లోక(lokah), కిష్కింధపురి(Kishkindhapuri) సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు చాలా మందికి సుపరిచితుడే. అతను మరెవరో కాదు కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్(snady master). ఈ మూడు సినిమాల్లో విలన్ గా నటించి అందరి ప్రశంసలు అందుకున్న శాండీ, తాజాగా కిష్కింధపురిలో ఛాలెంజింగ్ రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కిష్కింధపురిలో విశ్వవ పుత్ర(viswava putra) పాత్రలో ఎంతో ఒదిగిపోయాడు శాండీ.
విశ్వవపుత్ర లాంటి క్యారెక్టర్లు అందరూ చేయలేరు. కానీ శాండీ మాత్రం దాన్ని చాలా హుందాగా చేశారు. అయితే తన కళ్లను చూసి చిన్నప్పుడు అందరూ డెత్ గోట్ ఐస్ అని కామెంట్ చేసేవారని, కానీ ఇప్పుడు ఆ కళ్ల వల్లే తనకు విలన్ గా అవకాశాలు వస్తున్నాయని, ఆ కళ్లను చూసే లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) తనకు లియోలో సైకో క్యారెక్టర్ ను ఆఫర్ చేశాడని శాండీ చెప్పాడు.
ఈ స్థాయికి రావడానికి తానెంతో కష్టపడ్డానని, చిన్నప్పుడు వంద, నూట యాభై కోసం గుళ్లల్లో, పెళ్లిళ్లలో డ్యాన్సులు వేసేవాడినని చెప్పాడు శాండీ. ఇకపై తన ఫోకస్ మొత్తం యాక్టింగేనని, ప్రస్తుతం హీరోగా పా.రంజిత్(pa. Ranjith) నిర్మాణంలో ఓ సినిమాతో పాటూ మలయాళ సినిమా కథనార్(kathanar) లో విలన్ గా చేస్తున్నానని, ఇకపై డ్యాన్స్, యాక్టింగ్ రెండింటింనీ బ్యాలెన్స్ చేసుకుంటానని చెప్పాడు శాండీ.