Lokesh Kanagaraj: రజినీ- కమల్ మల్టీస్టారర్ డైరెక్టర్ లోకేష్ కాదా?

మా నగరం(maa nagaram) సినిమాతో డైరెక్టర్ గా మొదటి సక్సెస్ అందుకున్న లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj), ఆ తర్వాత కార్తీ(karthi)తో చేసిన ఖైదీ(Khaithi) సినిమాతో మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. ఖైదీ తర్వాత లోకేష్ వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసి క్రేజ్ ను బాగా పెంచుకున్నాడు. మాస్టర్(master), విక్రమ్(vikram), లియో(leo) సినిమాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు లోకేష్.
అయితే లోకేష్ నుంచి ఆఖరిగా వచ్చిన రెండు సినిమాలూ రిలీజ్ కు ముందు విపరీతమైన క్రేజ్ తో వచ్చి రిలీజ్ తర్వాత మాత్రం అనుకున్న ఫలితాల్ని అందుకోలేకపోయాయి. లియో సినిమా మంచి సక్సెస్ ను అందుకున్నప్పటికీ, రిలీజ్ ముందున్న క్రేజ్ తో చూస్తే ఆ సినిమా ఇంకా మంచి వసూళ్లను రాబట్టాల్సింది. ఇక రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమా కూడా అంతే. ఎన్నో అంచనాలతో వచ్చిన కూలీ(Coolie) ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
అయితే కూలీ మూవీ ప్రమోషన్స్ లో లోకేష్ తన నెక్ట్స్ మూవీని కార్తీతో ఖైదీ2 ను చేయనున్నారని చెప్పాడు. కానీ తర్వాత రజినీకాంత్(rajinikanth), కమల్ హాసన్(kamal haasan) తో కలిసి ఓ మల్టీస్టారర్ చేయనున్నాడని వార్తలు రావడంతో ఖైదీ2(khaidhi2) వాయిదా పడిందనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి చేయనున్న సినిమా లోకేష్ డైరెక్షన్ లో కాదని, లోకేష్ నెక్ట్స్ మూవీ కార్తీతో ఖైదీ2నే అని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆ మల్టీస్టారర్ ను డైరెక్ట్ చేసేదెవరని అందరూ ఆశ్చర్యపోతున్నారు.