వెకేషన్ మోడ్లో ఇస్మార్ట్ బ్యూటీ
నన్ను దోచుకుందువటే(nannu dochukunduvate) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నభా నటేష్(nabha natesh) మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఇస్మార్ట్ శంకర్(ismart shankar) తో సూపర్ సక్సెస్ ను అందుకున్న నభా, ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను, గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా నభా వెకేషన్ కు వెళ్లి అక్కడ్నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో నభా బ్రౌన్ కలర్ టాప్, హై వేస్టెడ్ లెగ్గింగ్స్ లో అదిరిపోయే లుక్ లో దర్శనమివ్వగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.








