దిల్ రాజు గారి ప్రొడక్షన్స్‌లో హీరోగా అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్న – హీరో యశ్వంత్
దిల్ రాజు ప్రొడక్షన్స్ LLP, హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా, జీ స్టూడియోస్ సమర్పణలో, యశ్వంత్, ధనశ్రీ వర్మ ప్రధాన పాత్రల్లో న్యూ ఏజ్ లవ్ స్టొరీ ‘హే కన్నమ్మ’ ట్రైలర్ లాంచ్
యశ్వంత్, ధనశ్రీ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘హే కన్నమ్మ’. శశి కుమార్ ముత్తులూరి రచన, దర్శకత్వంలో, జీ స్టూడియోస్ సమర్పణలో, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా, బ్యూటిఫుల్ ఎమోషన్స్‌తో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో యశ్వంత్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కెమెరా వెనక పనిచేసిన నేను ఇప్పుడు ఇలా నటుడిగా నిలబడి మాట్లాడటం చాలా కొత్తగా ఉంది. మూవీ ఇండస్ట్రీలోకి వెళ్లాలనే కలతో హైదరాబాద్ వచ్చాను. ఈ జర్నీలో నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చిన్న స్క్రీన్ నుంచి ఇప్పుడు పెద్ద స్క్రీన్‌లోకి వస్తున్నాను. మా టీమ్ అందరికీ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు నన్ను ఆఫీసుకు పిలిచి, ఒక మ్యూజికల్ డాన్స్ సినిమా చేస్తున్నాం.. నువ్వే హీరో అని చెప్పగానే షాక్ అయ్యాను. తర్వాత డైరెక్టర్ శశితో కలిశాను. అప్పటినుంచి మా జర్నీ మొదలైంది. ఈ కథ మనందరి జీవితాల్లో జరిగే పరిస్థితులకు దగ్గరగా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. ఈ సినిమా చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. నాలో హర్ష క్యారెక్టర్‌ను చూసుకున్న మా డైరెక్టర్‌కు థాంక్యూ. మా టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వెంకటేష్ తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. నవంబర్ 27న సినిమా రిలీజ్ అవుతోంది. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.”
డైరెక్టర్ శశి కుమార్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలనేది నా డ్రీమ్. నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూసి దిల్ రాజు గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. దిల్ రాజు గారితో సినిమా చేయడం ఎవరికైనా ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ ఈరోజు నిజమైంది. ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ది బెస్ట్ సపోర్ట్ ఇచ్చారు. నాకు ఎప్పటినుంచో ఒక యూత్‌ఫుల్ రొమాన్స్ సినిమా చేయాలని, మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ చేయాలని ఉండేది. అందుకే ఈ సినిమా చేశాను. ఆరు పాటలు వచ్చేలా మొత్తం కాన్సెప్ట్‌ను సెట్ చేసి ఈ సినిమాను తెరకెక్కించాం. థియేటర్లో సినిమా ఒక కాన్సర్ట్‌లా ఉంటుంది. ఈ సినిమాలో మ్యూజిక్ చాలా కీలకం. మంచి మ్యూజికల్ సీక్వెన్స్‌లు ఉంటాయి. మ్యూజిక్‌తోనే కథ చెప్పాం. డాన్సర్‌గా యశ్వంత్ మీ అందరికీ తెలుసు. కానీ నేను రాసిన క్యారెక్టర్‌కు 100 శాతం పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ధనశ్రీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా యాడ్ అయింది. వెంకటేష్ కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా చూసినప్పుడు మనసు బరువెక్కుతుంది.. తేలికపడుతుంది. ఇది నా ప్రామిస్. మా టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మ్యూజిక్ ఇచ్చిన కార్తీక్ గారికి థాంక్యూ. ఈ సినిమాలోని పాటలన్నీ గుర్తుండిపోయేలా ఉంటాయి. సినిమా మీ అందరి మనసులను హత్తుకుంటుంది.”
ఇవి కూడా చదవండి
హీరోయిన్ కార్తీక మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమాను చాలా ప్రేమతో, కష్టపడి చేశాం. దీని వెనుక చాలామంది హార్డ్ వర్క్ ఉంది. ఎన్నో కలలు ఉన్నాయి. మా కలలు నిజమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ప్రతి మూమెంట్‌ను చాలా ఎంజాయ్ చేశాం. మేము ఈ సినిమాను ఎంత ప్రేమతో చేశామో, మీరు కూడా అంతే ప్రేమను అందిస్తారని కోరుకుంటున్నాను.”
హీరోయిన్ ధనశ్రీ మాట్లాడుతూ.. “ఇది చాలా అద్భుతమైన కథ. ఈ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. యశ్వంత్ ఎంతో సపోర్ట్ చేశారు. రామ్ గారు చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. మా డైరెక్టర్ అద్భుతమైన కథ రాశారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ గుర్తుండిపోతుంది. నవంబర్ 27న అందరూ ఈ సినిమాను థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను.”
డీవోపీ రామ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరినీ అలరిస్తుంది. విజువల్ స్టోరీ టెల్లింగ్ పరంగా కొత్త అనుభూతిని ఇస్తుంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.







