Deepika Padukone: ఈవిడ ప్రభాస్ కంటే కాస్ట్లీ..?

తెలుగులో నటించేందుకు గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరోయిన్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ లో నటించేందుకు కష్టాలు పడితే, ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో ఒక సినిమా చేసినా, చాలు అనుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడి స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి. జాన్వీ కపూర్(Janvi Kapoor), మృణాల్ ఠాకూర్, శ్రద్ధా కపూర్, దిశా పటాని వంటి హీరోయిన్లు తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి.
ఇదే సమయంలో దీపిక పదుకొనేకి కూడా అవకాశాలు భారీగానే వచ్చాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఛాన్స్ ఇచ్చేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించారు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమాలో, ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని ముందు భావించారు. కానీ రెమ్యూనరేషన్ విషయంలో ఆమె వెనక్కి తగ్గకపోవడంతో, సినిమా యూనిట్ ఆమెను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇది కాస్త వివాదాస్పదంగా మారి హిందీ వర్సెస్ తెలుగుగా కూడా, కొన్ని రోజులు సోషల్ మీడియాలో వార్ నడిచింది.
ఇక ఇప్పుడు ఆమె కల్కి పార్ట్ 2 సినిమా నుంచి కూడా తప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. దీనితో దీపికా పదుకొనే విషయంలో టాలీవుడ్ లో చర్చ మొదలైంది. రెమ్యునరేషన్ విషయంలో ఆమె భారీగా డిమాండ్ చేయడం, అలాగే హిందీలో లాభాలు కూడా అడగటంతో నిర్మాతలు, ఆమెను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు నిర్మాతలు గాని, దర్శకులు గానీ ఆమెను సంప్రదించకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం.
తాను భారీగా డిమాండ్ చేయడమే కాకుండా తనకు వ్యక్తిగత స్టాఫ్ విషయంలో కూడా ఆమె రాజీ పడటం లేదని టాక్. విదేశాల్లో షూటింగ్ జరిగే సమయంలో భారీగా స్టాఫ్ కావాలని అడుగుతున్నారని, దీనితో నిర్మాతలపై భారీగా భారం పడుతుందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కల్కి పార్ట్ వన్ లో ఆమె నటించారు. ఆమె యాక్షన్ కు మంచి మార్కులు పడ్డాయి. దీనితో పార్ట్ 2 లో కూడా ఆమెకు అవకాశం ఇవ్వాలని భావించినా, రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాత పై భారీగా భారం పడటంతో, ఇక ఆమెను పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభాస్ తో కూడా లేని సమస్యలు ఆమెతో రావడంతో నిర్మాత భయపడిపోయినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.