మహేష్ కు విలన్ గా రానా?
టాలీవుడ్ నటుల్లో ఎలాంటి పాత్రలైనా చాలా ఈజీగా చేసేయగల నటుల్లో రానా(rana Daggubati) ఒకడు. అందుకే రానా అన్ని భాషల్లో సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. పాత్ర నచ్చితే ఏ భాషలో అయినా రానా నటించేస్తాడు. హీరోగా, విలన్ గా రానా చేసిన పాత్రలు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. రీసెంట్ గా రజినీకాంత్(Rajinikanth) వేట్టయాన్(vettayan) లో విలన్ గా నటించి మెప్పించాడు రానా.
ఆ సినిమాలో రానా నటన చాలా ప్రొఫెషనల్‌గా ఉంది. స్క్రీన్ పై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతసేపు మంచి వైబ్ ఉంటుంది. ఆ సినిమా చూసిన తర్వాత రానాకు హీరో కంటే ఇలాంటి పాత్రలతో ఆడియన్స్ కు బాగా దగ్గరవుతున్నాడనే ఫీలింగ్ కలిగింది. ఇలాంటి టైమ్ లో రానా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది.
మహేష్ బాబు(Mahesh Babu)- రాజమౌళి(rajamouli) కలయికలో రానున్న సినిమాలో రానా విలన్ గా నటిస్తున్నాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో రానా ఆఫ్రికాలోని మసాయి తెగకు చెందిన ఓ కీలక సభ్యుడిగా కనిపించనున్నాడని, రాజమౌళి కోరిక మేరకు రానా ఈ సినిమాలో నటిస్తున్నాడంటున్నారు. అంతేకాదు రాజమౌళి ప్రస్తుతం నిర్వహిస్తున్న వర్క్ షాప్స్ కు కూడా రానా హాజరవుతున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.













