ప్రభాస్తో ప్రశాంత్ వర్మ మూవీ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) హీరోగా ప్రశాంత్ వర్మ(prasanth Varma) దర్శకత్వంలో సినిమా ఉంటుందని, దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడైనా రావొచ్చనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వార్త విన్న నందమూరి ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దానికి కారణం మోక్షజ్ఞ(mokshagna) డెబ్యూ డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మనే.
అసలే సినిమాటిక్ యూనివర్స్ పేరిట మహాకాళి(mahakali), అధీరా(adheera) లాంటి క్రేజీ ప్రాజెక్టులను ఇతర డైరెక్టర్లతో తీయిస్తూ ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నాడు. మళ్లీ కొత్తవి ఒప్పుకుంటే వీటి మధ్య బ్యాలెన్స్ తప్పొచ్చని వారి టెన్షన్. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ప్రస్తుతం ఇచ్చిన కమిట్మెంట్ల ప్రకారం ఇప్పట్లో ఈ కాంబినేషన్ సాధ్యమయ్యేలా లేదు.
ప్రభాస్ ముందుగా తన చేతిలో ఉన్న ది రాజా సాబ్(The Raja Saab), ఫౌజీ(Fouji) కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత స్పిరిట్(spirit) చేయనున్నాడు. తనకు విడిగా డేట్లు ఇమ్మని ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా(sandeep Reddy vanga) అడిగాడని, దానికి ప్రభాస్ కూడా ఒప్పుకున్నాడని టాక్ ఉంది. ఆ తర్వాత కల్కి2(Kalki2), సలార్2(salaar2) చేయాలి. ఎంతలేదన్నా వీటికి మూడేళ్లకు పైగా టైమ్ పడుతుంది. ఇటు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తర్వాత జై హనుమాన్(Jai Hanuman) ను తెరకెక్కించాలి. మార్కెట్, బిజినెస్ పరంగా చూసుకుంటే ఆ సినిమాను ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇదంతా పుకారే అని తెలుస్తోంది. ఒకవేళ నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ఈ కాంబో కుదిరినా దానికి టైమ్ పట్టనుంది.













