Naga Vamsi: నాగ వంశీ చెప్పిన సందీప్ రెడ్డి వంగా రేంజ్ మూవీ అదేనా?
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ను స్టార్ట్ చేసి సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు. యాక్టింగ్ తో మాత్రమే కాకుండా రైటర్ గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సిద్దూ మినిమం గ్యారెంటీ హీరో అయిపోయాడు. అయితే సిద్దు ఎన్ని సినిమాలు చేసినా తనకు మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది మాత్రం టిల్లు ఫ్రాంఛైజ్ సినిమాలతోనే.
డీజే టిల్లు(DJ Tillu) మూవీతో సిద్దు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన టిల్లు స్వ్కేర్(Tillu Square) సినిమా కూడా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి సిద్దూ మార్కెట్ ను ఇంకా పెంచింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskhar) దర్శకత్వంలో జాక్(Jack), నీరజ కోన(Neeraja Kona) దర్శకురాలిగా తెరకెక్కుతున్న తెలుసు కదా(Telusu Kadha) సినిమాలతో బిజీగా ఉన్న ఉన్నాడు సిద్దు.
అయితే గతంలో నిర్మాత నాగ వంశీ(Naga Vamsi) తాను సిద్దుతో ఓ మూవీ అనుకుంటున్నానని, అనుకున్న కథను అనుకున్నట్టు చూపిస్తే అదొక సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) సినిమాలా అనిపిస్తుందని, సినిమా సక్సెస్ అయితే సందీప్ రెడ్డి వంగా లాగా తీశారంటారని, అదే ఫెయిలైతే సందీప్ రెడ్డి స్టైల్ లో సినిమా చేయాలని ట్రై చేసి ఫెయిలయ్యారంటారని ఓ ఇంటర్య్వూలో అన్నాడు. అంతర్గత సమాచారం ప్రకారం సిద్దుకి ఆల్రెడీ ఓ స్టోరీ ఓకే అయిందని తెలుస్తోంది. తనతో కృష్ణ అండ్ హిజ్ లీలా(Krishna And His Leela) సినిమా తీసిన రవికాంత్ పేరేపు(Ravikanth Perepu) డైరెక్షన్ లో సిద్దు ఓ మూవీ చేయనున్నాడని, అప్పట్లో నాగ వంశీ చెప్పిన కథ ఇదేనని చాలా మంది అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే వీలుంది.













