దాదాపై టైమ్ ప్రెజర్?
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని(Gopichand malineni) తెరకెక్కిస్తున్న దాదా సినిమాపై ఇప్పుడు టైమ్ ప్రెజర్ పెరిగింది. బాలయ్య(balayya) గాయపడటంతో కొంతకాలం షూటింగ్‌కు బ్రేక్ పడగా, ప్రాజెక్ట్ షెడ్యూల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు సినిమాలు ఉండటంతో దాదా(daada) సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ చేశారు. దీంతో మిగిలిన వర్క్స్ ను వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
బాలకృష్ణ అవసరం లేని సీన్స్ కు సంబంధించిన షూటింగ్‌ను గోపీచంద్ మలినేని ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా మరోవైపు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య కోలుకుని షూటింగ్‌కు అందుబాటులోకి రానుండటంతో ఆయనపై షూట్ చేయాల్సిన కీలక సీన్స్ ను శరవేగంగా పూర్తి చేయడంపై టీమ్ ఫోకస్ పెట్టింది. అక్టోబర్‌లో వీలైనన్ని ఎక్కువ రోజులు షూటింగ్ జరిపి, పెండింగ్ వర్క్‌ను క్లియర్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
క్రిస్మస్ రిలీజ్‌ను టార్గెట్‌గా పెట్టుకోవడంతో దాదా టీమ్‌కు వచ్చే రెండు నెలలు అత్యంత కీలకం కానున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ కు సంబంధించిన ఇతర పనుల్ని సమాంతరంగా నడిపించాల్సి ఉంటుంది. డిసైడ్ చేసిన టైమ్ కు సినిమాను రెడీ చేయాలంటే యూనిట్ రాత్రింబవళ్లు పనిచేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వెంకట సతీష్ కిలారు(venkata satish kilaru) నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్(thaman) మ్యూజిక్ అందిస్తున్నారు.








