మోకాలి గాయంతోనే షోను కంటిన్యూ చేసిన మెగాస్టార్
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమితాబ్ బచ్చన్(amitabh bachan)కు షూటింగ్ టైమ్ లో గాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి18(kaun banega karodpathi 18)తో బుల్లితెర ఆడియన్స్ ను అలరిస్తున్న ఆయన.. మోకాలి గాయంతో స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందురోజు షూటింగ్ టైమ్ లో ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఎడమ మోకాలికి గాయమైనట్లు అమితాబ్ స్వయంగా వెల్లడించారు. ఈ ఘటన కారణంగా నిలబడేందుకు కూడా కొంత ఇబ్బంది పడినట్లు తెలిపారు.
సాధారణంగా కేబీసీ(KBC) ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టేజ్ మధ్యలో నిలబడి తనదైన శైలిలో మోనోలాగ్‌తో ఆడియన్స్ ను పలకరించే అమితాబ్.. ఈసారి మాత్రం కూర్చునే షో ను స్టార్ట్ చేశారు. తన మోకాలి గాయం కారణంగానే ఈ మార్పు చోటు చేసుకుందని అమితాబ్ వివరించారు. అయితే గాయం పెద్దదేమీ కాదని ఆడియన్స్ కు భరోసా ఇచ్చారు. కంటెస్టెంట్లతో మాట్లాడే టైమ్ లో నిలబడతానని చెబుతూనే.. ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉందని అంగీకరించారు. గాయం ఉన్నప్పటికీ ఎపిసోడ్‌ను కంటిన్యూ చేయడం విశేషం.
మరోవైపు, వయసు పెరిగినవారిలో కిందపడిన తర్వాత నిలబడటానికి ఇబ్బంది కలగడాన్ని నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎముకలకు గాయమైందా లేదా తెలుసుకోవడానికి ఎక్స్‌రే, అవసరాన్ని బట్టి లిగమెంట్లు, కార్టిలేజ్ సమస్యలను గుర్తించేందుకు ఎంఆర్ఐ పరీక్షలు ఉపయోగపడతాయి. 83 ఏళ్ల వయసులోనూ టీవీ, సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అమితాబ్.. ప్రస్తుతం కేబీసీ18తో పాటు సెక్షన్84(section 84), కల్కి 2898ఏడీ పార్ట్2(kalaki 2898-2) సినిమాలతో ఆడియన్స్ ముందుకు రానున్నారు.








