వెంకీ మూవీతో క్లాష్ అవుతున్న హనుమాన్ అంశ్
చిన్న బడ్జెట్లో తెరకెక్కి దేశవ్యాప్తంగా భారీ సక్సెస్ నుఅందుకున్న సినిమాగా హనుమాన్ అంశ్Ihanuman ansh) ఇప్పుడు సౌత్‌లోకి అడుగుపెడుతోంది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో కొన్ని వారాలుగా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతూ ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మొదట త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ ముందుకొచ్చినప్పటికీ, ఆ ప్లాన్ అనూహ్యంగా మారిపోయింది. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ సౌత్ రైట్స్ ను సొంతం చేసుకోవడంతో తెలుగు రిలీజ్‌కు మార్గం సుగమమైంది.
తాజా సమాచారం ప్రకారం హనుమాన్ అంశ్ అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే డబ్బింగ్ సహా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఈ సినిమాకు ఊహించని పోటీ ఎదురైంది.
ఇవి కూడా చదవండి
అదే రోజున వెంకటేష్(venkatesh) ప్రధాన పాత్రలో నటించిన త్రివిక్రమ్(trivikram) సినిమా ఆదర్శ కుటుంబం(adarsha kutumabam) కూడా థియేటర్లలోకి రానుండటంతో బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
హనుమాన్ అంశ్ కు డైరెక్టర్, నిర్మాతగా విశాల్ చతుర్వేది(vishal chaturvedi) వ్యవహరించారు. స్వంభు మీడియా(Swambhu media) నెట్వర్క్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆయన రచించిన డివైన్ డిటూర్: దట్ చేంజ్డ్ మై లైఫ్ బుక్ ఆధారంగా తెరకెక్కింది. నీమ్ కరోలి బాబా(neem karoli baba) జీవితంలోని ఆధ్యాత్మిక కోణాలను కథాంశంగా తీసుకున్న ఈ భక్తి ప్రధాన సినిమాలో శోభినవ్ సత్యా(sobhinav satya), చందన్ ఆనంద్(Chandan Anand) కీలక పాత్రల్లో కనిపించారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తిని రేకెత్తిస్తుందో చూడాలి.








