చిరంజీవి, బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుతాడంటారా?
మరొ రెండు రోజుల్లో బాలకృష్ణ పుట్టినరోజు రాబోతోంది. అయితే ఈ పుట్టినరోజుకు చాలప్రత్యేకత ఉంది. ఈసారి ఈ పుట్టినరోజుతో బాలయ్యషష్టిపూర్తి జరుపుకొబోతున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పరిస్థితులు వల్ల బాలయ్య తన షష్టిపూర్తి రోజున ఎలాంటి వేడుకలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నా బాలయ్య కుటుంబ సభ్యులు మాత్రం ఈషష్టిపూర్తిని చాల డిఫరెంట్ గా నిరాడంబరంగా జరపాలని ప్లాన్స్ లో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితులలో బాలయ్య అభిమానులు తమ హీరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన జూన్ 10న సోషల్ మీడియాలో తారాస్థాయిలో హడావిడి చేయబోతున్నారు. అదే విధంగా బాలకృష్ణ సన్నిహితులైన అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు ఆ రోజు బాలకృష్ణ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియ చేయడానికి సిద్ధంగా వున్నారు. ఇక్కడే చిరంజీవికి ఒక అనుకోని సమస్య ఎదురుకాబోతోంది అని అంటున్నారు. చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు మొదలుకుని ఈమధ్యనే జరిగిన రానా పెళ్ళి ప్రకటన మరియు నిఖిల్ పెళ్ళి వరకు ఇలా సినిమా పరిశ్రమకు సంభందించి ముఖ్యమైన సందర్భాలను సద్వినియోగం చేసుకుని ఇండస్ట్రీలోని అందరి పుట్టినరోజులకు ఇలా ప్రతి విషయానికి చిరంజీవి తన శుభాకాంక్షలు తెలియచేస్తూ తన పెద్దన్న పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ అలవాటు చిరంజీవికి ఒక కొత్త సమస్యను బాలయ్య అభిమానులతో తెచ్చి పెడుతుందా అన్నసందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ టాప్ హీరోలలో బాలకృష్ణకు సముచిత స్థానం ఉంది. దీనికితోడు గతంలో జరిగిన చిరంజీవి షష్టిపూర్తి వేడుకలకు బాలకృష్ణ స్వయంగా వెళ్ళడమే కాకుండా ఆ ఫంక్షన్ లో బాలయ్య స్టెప్స్ కూడ వేసాడు. ఇలాంటి పరిస్థితులలో చిన్నచిన్న భేధాభిప్రాయలను పక్కకు పెట్టి బాలయ్య షష్టిపూర్తి సందర్భంగా చిరంజీవి తన అభినందనలు సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తాడా లేదా అన్నఆసక్తి బాలయ్య అభిమానులలో పెరిగిపోతోంది. ఒకవేళ చిరంజీవి బాలయ్య షష్టిపూర్తి నాడు తన అభినందనలు తెలియచేయకుంటే ఈవిషయాన్ని మనసులో పెట్టుకుని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏ విధంగా రెచ్చిపోతారో ఏం గందర గోల పరిస్థితి నెలకుంటుందోన్న భయాందోళనలో వుంది ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి.













