రాక్షస రాజా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్
హీరో రానా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తాడు. విరాట పర్వం తర్వాత రానా ఇప్పటి వరకు మరో సినిమాను అనౌన్స్ చేసింది లేదు. గతేడాది భీమ్లా నాయక్ తో ప్రేక్షకుల్ని పలకరించిన రానా, ఈ యేడు అసలు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. తాజాగా రానా, తేజ దర్శకత్వంలో రాక్షస రాజా అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తేజతో తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రానా, ఆ నమ్మకంతోనే తేజతో మరో సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. మళ్లీ వారిద్దరి కాంబోలో రానున్న రాక్షస రాజాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు అటు రానా, ఇటు తేజ. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి నెట్టింట వినిపిస్తోంది.
రాక్షస రాజా సినిమా 1930 బ్యాక్ డ్రాప్ లో నడిచే ఓ గ్యాంగ్ స్టార్ స్టోరీగా తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం. స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏదైనా సరే ఫిక్షనల్ స్టోరీకి రియల్ ఇన్సిడెంట్స్ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందని సినీ లవర్స్ అంటున్నారు. మరి రానాతో తేజ ఈసారి ఎలాంటి కథను చెప్తాడని తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా రానాకు ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో చూడాలి.













