మోక్షజ్ఞ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
నందమూరి బాలకృష్ణ(Balakrishna) వారసుడు మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. మొన్నీ మధ్యే మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా సినిమాను అనౌన్స్ చేశారు. హనుమాన్(hanuman) డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం కానున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమా కథకు ప్రశాంత్ వర్మ పురాణాల టచ్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో మోక్షజ్ఞ అభిమన్యుడిగా కనిపిస్తాడని టాక్. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ మొదటి సినిమా ముహూర్త కార్యక్రమాలు డిసెంబర్ 2న జరుగుతాయని, ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పెద్దలంతా హాజరవుతారని తెలుస్తోంది. మోక్షజ్ఞ సరసన హీరోయిన్ గా రవీనా టండన్(Raveena Tandon) కూతురు రషా తథానీ(Rasha Thadani)ని ఫైనల్ చేశారని సమాచారం.
అంతేకాదు ఈ సినిమాలో విలన్ గా రానా(Rana Daggubati)ను ట్రై చేస్తున్నారని టాక్. మోక్షజ్ఞ మొదటి సినిమా కావడంతో బాలయ్య(Balaiah) కూడా ఈ సినిమా లో చిన్న క్యామియో చేయనున్నాడట. బాలయ్య పాత్రతో సినిమా నెక్ట్స్ లెవెల్ కు వెళ్లనుందని సమాచారం. డిసెంబర్ 2న మొదలుపెట్టి, తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ చేసేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.













